అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ఒలంపియాడ్లో బంగారు పతకాలు
కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఇంటర్నేషనల్ రీజనింగ్ & ఆప్టిట్యూడ్ ఒలంపియాడ్లో పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రీజనింగ్ & ఆప్టిట్యూడ్ పరీక్షలు విద్యార్థుల మేధస్సును మెరుగుపరుస్తాయని, నిర్ణయాత్మక శక్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ సిల్వర్ జోన్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ పరీక్షల్లో యల్. రామన్ (7వ తరగతి), ఎస్.పి. కృష్ణ చైతన్య (8వ తరగతి), జి. సాయి నంహిత్ (9వ తరగతి), ఎం. హిమేష్ చంద్ర (10వ తరగతి) బంగారు పతకాలు, ఎం. శివేంద్ర రెడ్డి (8వ తరగతి), పి. శ్లోక (9వ తరగతి), డి. ఉదయశ్రీ (10వ తరగతి) రజత పతకాలు సాధించారు.
విజేతలకు పుష్పగుచ్ఛాలు అందజేసి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
