వనపర్తి జిల్లా క్యాంప్ ఆఫీసులో శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో పెబ్బేరు మండలంలోని లబ్ధిదారులకు CMRF, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మొత్తం 134 చెక్కులు అందజేశారు. ఇందులో 107 CMRF చెక్కులు కాగా, 27 కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులు ఉన్నాయి.ఈ సందర్భంగా తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారుని వరించేలా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పెబ్బేరు మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
