హనుమకొండ, మార్చి 30 (జిందగీ9 న్యూస్): హనుమకొండ ములుగు రోడ్డులో శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు ఫర్నిచర్ షాపులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి, నష్టపోయిన వ్యాపారస్తుల సమస్యలను ఆలకించారు.
ఈ అగ్నిప్రమాదంలో మిషనరీ, టేకు కర్రలు పూర్తిగా దగ్ధమై, సుమారు కోటిన్నర రూపాయల మేర నష్టం వాటిల్లిందని వ్యాపారస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తమ జీవనోపాధి నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి సురేందర్, డివిజన్ అధ్యక్షులు గన్నారపు సంగీత్ కుమార్, జక్కుల రవీందర్ యాదవ్, కాజిపేట తహసిల్దార్ భావ్ సింగ్, తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
