మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శిరిడి సాయిబాబా ను బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, పరిగి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బేరి రామచందర్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మనుమడు బేరి వేదాన్ యాదవ్ పుట్టు వెంట్రుకల పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల మధ్య పూజా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని, అనంతరం దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, ఎండలు అధికంగా ఉన్న ఈ కాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
వేసవి కాలంలో నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, అధికంగా నీరు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గొర్రెల-మేకల పెంపకం వృత్తిదారుల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్, బీసీ ఫెడరేషన్ ముదిరాజ్ సాయన్న తదితరులు బేరి రామచందర్ యాదవ్ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుండాలని, శిరిడి సాయిబాబా ఆశీస్సులు లభించాలని కోరుకున్నారు.
