హైదరాబాద్, 20 మార్చి 2025: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కు తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేజీ నం. 16 లో పేర్కొన్న బీసీ డెకరేషన్ ప్రకారం, బీసీ కార్పొరేషన్లో ఫెడరేషన్ కింద నమోదైన ప్రతి సహకార సంఘానికి రూపాయలు 10 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని నైవేద్యంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార సంఘాలకు కూడా కార్పొరేషన్ అనుబంధంగా గుర్తింపు ఇచ్చి, 50 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించాలని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆన్లైన్ విధానం ద్వారా నిధుల పంపిణీ చేపట్టాలని మంత్రివర్యులను కోరారు. 1964 సహకార సంఘ చట్టం ప్రకారం 11 నుండి 15 మంది సభ్యులతో రిజిస్టర్ అయిన సంఘాలకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి & సంక్షేమ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తొవిటి సదానంద చారి, రాష్ట్ర కోశాధికారి & కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసుల కిరణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు & పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగిరి లింగయ్య, సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వినతిపత్రాన్ని స్వీకరించి, ఈ ప్రతిపాదనపై సకాలంలో స్పందిస్తామని హామీ ఇచ్చారు.
—
(Zindagi9News ప్రత్యేక ప్రతినిధి)
