జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామానికి చెందిన గాదె ప్రభాకర్ పటేల్ సామాజిక బాధ్యతను నెరవేర్చుతూ, పేదలకు సహాయం చేయడంలో ముందుంటున్నారు. గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు.
ఇటీవల, గ్రామానికి చెందిన మాదారపు రాజేశ్వరరావు తల్లి రాధమ్మ అనారోగ్యంతో పరమపదించగా, గండ్రపల్లి సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ఆర్థిక మరియు నిత్యావసర సహాయం అందించారు. ఈ క్రమంలో, గాదె ప్రభాకర్ పటేల్ 50 కిలోల బియ్యం అందించగా, గండ్రపల్లి శాశ్వత ఫౌండర్ పుల్లయ్యగారి లింగారావు రూ.2,000 లు సహాయంగా ఇచ్చారు.
తల్లి కోల్పోయిన రాజేశ్వరరావుకు భగవంతుడు ధైర్యం కలిగించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. “సేవ చేయడం ప్రధాన లక్ష్యం. చేతిలో ఉన్నంత వరకు పేదలకు అండగా ఉంటాను” అని గాదె ప్రభాకర్ పటేల్ తెలిపారు.
ఈ సేవా కార్యక్రమం గ్రామస్తులందరికీ ఆదర్శంగా నిలిచింది.
