బోయినిపల్లి, మార్చి 16 : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల ఆత్మీయసమ్మేళనంలో ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎంపీ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని దీమవ్యక్తం చేస్తూ, కార్యకర్తలకు దశ-దిశ నిర్దేశం చేశారు,
ఈ ఆత్మీయ సమ్మేళనంలో బోయినిపపల్లి మండలంలోని బిజెపి నాయకులు పాల్గొని బీజేపీ నూతన జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన రెడ్డబోయిన గోపిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బోయినిపల్లి మండల బీజేపీ సీనియర్ నాయకులు కొండం శ్రీనివాస్ రెడ్డి, పాలోజు రాజేంద్రప్రసాద్ (రాము), ఆవుల లక్ష్మణ్, ఇల్లందుల బాలయ్య, సారంపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.
