ఇల్లంతకుంట, మార్చి 5: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు బుధవారం రోజున ఆలయ అధికారులు నిర్వహించారు. ఆగస్టు 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా, మొత్తం రూ. 5,45,847 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఈ లెక్కింపు కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా దేవాదాయ పరిశీలకులు పి. సత్యనారాయణ, ఆలయ ఈవో కె. సుధాకర్, అర్చకులు, ఆలయ సిబ్బంది, శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
అలయ అభివృద్ధికి భక్తులు చేసే విరాళాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు తమ భక్తి శ్రద్ధలతో అందించిన కానుకల ద్వారా ఆలయంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

