జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక ప్రాంతాల్లోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో Yupp TV-Turito Founder & CEO పాడి ఉదయ్ నందన్ రెడ్డి పుట్టినరోజు (25-02-2025) సందర్భంగా తాళ్లపెళ్లి కుమారస్వామి (బ్రైట్ కోఆర్డినేటర్), దాసారపు లోకేష్, వంశీకృష్ణ, ఇతర సోషల్ మీడియా ప్రతినిధులు ఆధ్వర్యంలో శనివారం రోజున పదో తరగతి విద్యార్థినులకు పరీక్షా సామగ్రిని అందజేశారు.150 మంది విద్యార్థినులకు 150 పరీక్షా ప్యాడ్స్, 300 పెన్నులు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించాలని పాడి ఉదయ్ నందన్ రెడ్డి తన అనుచరులతో ఆల్ ద బెస్ట్ సందేశం పంపించారు.ఈ కార్యక్రమంలో తాళ్లపెళ్లి కుమారస్వామి, దాసారపు లోకేష్, వంశీకృష్ణ, మంతెన శ్రీధర్, తొట్ల రాకేష్, మహంకాళి రాజు, కోరే రాకేష్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక ఎస్ ఓ లు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
— Zindagi9News
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
