హనుమకొండ,మార్చి 1: న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్ పోలీస్ అధికారులకు సూచించారు. నెలవారి సమీక్షలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ శనివారం కమిషనరేట్ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిసిపి లు ఏ.ఎస్పీ ,ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్, డివిజినల్, జోన్లవారిగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు, కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ వారిగా పోలీస్ అధికారులతో సమీక్షా జరిపారు. ఈ సమావేశంలో నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించడంతో పాటు, అధికారులతో పొలీస్ కమిషనర్ మాట్లాడుతూ పెండింగ్ లో వున్న చైన్ స్నాచింగ్ కేసులను త్వరగా పరిష్కరించి నేరస్థులను పట్టుకోవాలని బెయిల్ పై బయటకి కోర్టు వాయిదాలకు రాని నేరస్తులను కనిపెట్టి కోర్టు హాజరు పర్చాలి, నిందితుల అరెస్ట్ విషయంలో నిర్లక్ష్యం వద్దని, నేరాల నియంత్రణకై రాత్రుల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టాలని, అధికారులు భూతగాదాల్లో తలదూర్చవద్దని, రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న వేళ అధికారులు విజుబుల్ పోలిసింగ్ లో రోడ్లపై నిరంతరం గస్తీ నిర్వహించాలని త్వరలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించబడుతాయని కావున విద్యార్థులు సరైన సమయానికి పరీక్ష కేంద్రాలకు వెళ్ళేవిధంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చేయాలని, ఇదే సమయం మైనర్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ పై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని సీపీ అధికారులను అదేశించారు. ఈ సమావేశంలో డిసిపిలు, షేక్ సలీమా, రవీందర్, రాజమహేంద్ర నాయక్, ఏ.ఎస్పీ చేతన్, మనన్ భట్ తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు,ఎస్ఐ లు తదితరులు పాల్గొన్నారు.
