పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో గురువారం రాత్రి రైలు పట్టాల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి (వయస్సు సుమారు 35-40 సంవత్సరాలు) తలకు తీవ్ర గాయంతో పడి ఉన్నాడు. డ్యూటీలో ఉన్న పాయింట్స్ మాన్ ఈ విషయాన్ని గమనించి, స్టేషన్ మాస్టర్ కు సమాచారం అందించాడు.
స్టేషన్ మాస్టర్ 108 అంబులెన్స్ కు కాల్ చేయగా, మెరుగైన చికిత్స కోసం అతనిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వ్యక్తి మాట్లాడే స్థితిలో లేరు. అతని వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు. అయితే, అతని వద్ద తేదీ 26-02-2025 నాటి TGS RTC బస్సు టికెట్ (గోదావరిఖని నుండి పెద్దపల్లి),మహాలక్ష్మి ఫ్రీ టికెట్ ఉన్నాయి.
ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తు పట్టినట్లయితే, జి. తిరుపతి (రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్, రామగుండం) కు సమాచారం అందించగలరు.
📞 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
✅ 9949304574
✅ 8712658604
దయచేసి ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి, గాయపడిన వ్యక్తి కుటుంబ సభ్యులు అతనిని గుర్తించేలా సహకరించండి.
📢 Zindagi9News – నిజమైన వార్తలకు అంకితమై!
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
