హనుమకొండ, ఫిబ్రవరి 28: శుక్రవారం రోజున వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కాజిపేటలో నిర్మాణంలో ఉన్న Aమరియు B కేటగిరీలుగా జరుగుతున్న పనుల పురోగతిపై పరిశీలనా చేశారు.ఛత్తీస్గడ్ నుంచి రావాల్సిన బ్రిడ్జి సామగ్రిపై ఆరా తీశారు. శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి కాజీపేట ఆర్ ఓ బి పనులను వేగవంతం చేయాలని కోరతారని వెల్లడించారు.అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం మేము నిమగ్నమై ఉన్నాం.తమకు ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు.సొంత పార్టీలో ఉండి పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నారని మండిపడ్డారు.పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.గడిచిన ఏడాది కాలంలో నగరంలో ఎటువంటి గొడవలు,భూ కబ్జాలు లేవు,
అభివృద్ధి విషయంలో ఆటంకాలు కల్పిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
నియోకవర్గంలో అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయని ఈ సందర్బంగా మీడియా సమావేశం లో తెలిపారు.
