కర్నూల్ జిల్లాలో కృష్ణానది యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ నంద్యాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి, సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్. రంగ నాయుడు, సిపిఐ పట్టణ కార్యదర్శి కే. ప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కృష్ణా నది నీటి పంచాయితీలో రాయలసీమ హక్కులను కాపాడేందుకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే, రాయలసీమ ప్రాంతానికి తగిన నీటి హక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో భాస్కర్, శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, సంజీవులు, బాలకృష్ణ, రైతులు పాల్గొన్నారు.
