జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ల సమీక్ష సమావేశం శుక్రవారం జమ్మికుంటలో జరిగింది. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.
సభలో మాట్లాడుతూ రేవూరి ప్రకాష్ రెడ్డి, గత పది ఏళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ నిరుద్యోగులను విస్మరించాయని విమర్శించారు. గత ఏడాదిలో 55,000 ఉద్యోగాలను భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, పట్టభద్రుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపుకోసం కో-ఆర్డినేటర్లు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట, వీణవంక మండల కో-ఆర్డినేటర్లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
