ఇల్లందకుంట: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని పరకాల శాసనసభ్యులు, హుజురాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
గురువారం ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్స్ ఇన్చార్జిల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశాన్ని హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి 50 ఓటర్లకు ఒకరు ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకుని, పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యం:
ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే 55,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
