బోయినిపల్లి; ఫిబ్రవరి 16 : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి నుండి వేములవాడ వెళ్లే రహదారిలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యియి. ఆటోను వెనక నుంచి ట్రాక్టర్ ఓవర్టేక్ చేసే తరుణంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
