శంకరపట్నం, ఫిబ్రవరి 15:కరీంపేట గ్రామంలో ఓ గీతకార్మికుడు తాటిచెట్టు నుండి జారి పడడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, గ్రామానికి చెందిన గుర్రం వీరస్వామి శనివారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కి కళ్లను గీసే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. కాళ్లకు ఉన్న గుజి ఊడిపోవడంతో అదుపు తప్పి కిందకు పడిపోయాడు. మధ్యలో కొంత సేపు చెట్టుకు చిక్కుకున్న ఆయనను గ్రామస్థులు గమనించి సురక్షితంగా కిందకు దించారు.
ఈ ప్రమాదంలో నోటి దంతాలు విరగడంతో పాటు శరీరమంతా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.స్థానికులు, కుటుంబ సభ్యులు వీరస్వామి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
