కరీంనగర్: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో కరీంనగర్ పట్టణంలోని సుభాష్ నగర్ ఎస్సీ బాలికల హాస్టల్ వద్ద విద్యార్థులు పోస్టు కార్డు పోరాటం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష విద్యార్థులకు మద్దతుగా పాల్గొన్నారు.
విద్యార్థుల ఆవేదన :
ప్రభుత్వ హామీలు అమలు కావడం లేదని విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా శాఖ మంత్రిని ఇప్పటివరకు నియమించకపోవడం, ప్రత్యేకంగా మహిళలకు నిస్తారు చేసిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని వారు ఆరోపించారు.
ఫ్రీ బస్సు సౌకర్యం లాభం లేకుండాపోయిందని విద్యార్థులు వాపోయారు. గతంలో 20 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉండేదని, కాని ఇప్పుడు ఒక గంటకో బస్సు మాత్రమే వస్తోందని, అందువల్ల ప్రయాణం చేయడం కష్టమైందని తెలిపారు.

బిఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ, హాస్టల్స్‌లో తినే భోజనం నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం, టైలెట్ల నిర్వహణ దయనీయంగా ఉండటం వంటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, స్కాలర్షిప్లు వెంటనే అందించాలని, ప్రభుత్వం తన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
“తెలంగాణ విద్యార్థులకు తగిన వసతులు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని బిఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకురాలు జొన్ను స్వరూప, ఆముదాల అరుణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
