విదిష (మధ్యప్రదేశ్), ఫిబ్రవరి 9: ఆనందకరమైన వేడుకలో విషాదం చోటుచేసుకుంది. తన సోదరి పెళ్లి వేడుకలో స్టేజీపై డాన్స్ చేస్తూ యువతి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది.
పెళ్లి వేడుకలో ఉత్సాహంగా నర్తిస్తూ ఉన్న ఆమె ఒక్కసారిగా నేలకూలడంతో కుటుంబ సభ్యులు, అతిథులు షాక్కు గురయ్యారు. వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
– Zindagi9News
