కరీంనగర్,నిజామాబాద్, అదిలాబాద్,మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సిపిఐ నేతలు జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని సిపిఐ జిల్లా కార్యదర్శిల సమావేశం ఆదివారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగింది.
సమావేశమునకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, ఈ.టి. నర్సింహ లు ముఖ్య అతిథులుగా హాజరై పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి కి మద్దతు రాష్ట్ర పార్టీ నిర్ణయించిన విషయాన్ని తెలియజేశారు. పార్టీ నిర్ణయం ప్రకారం పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులతో పాటు పట్టబద్రులందరినీ కలిసి నరేందర్ రెడ్డి ని గెలిపించడం కోసం పార్టీ నాయకత్వం కృషి చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే తన గెలుపు కోసం సిపిఐ సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సిపిఐ కార్యాలయానికి వచ్చి సమావేశంలో పాల్గొన్న వారిని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర నాయకులు, జిల్లా కార్యదర్శులు గెలుపుకు హామీ ఇచ్చారు.
సమావేశంలో సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి సిద్ధిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు,పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం.
జగిత్యాల జిల్లా కార్యదర్శి వెన్న సురేష్.మంచిర్యాల జిల్లా కార్యదర్శి.రామడుగు లక్ష్మణ్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి.ముడుపు ప్రభాకర్ రెడ్డి.హనుమకొండ జిల్లా కార్యదర్శి.కర్రే భిక్షపతి. నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్.నిర్మల్ జిల్లా కార్యదర్శి ఎస్.విలాస్ తదితరులు పాల్గొన్నారు.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
