టేకుమట్ల: టేకుమట్ల మండల కేంద్రంలో MRPS మండల అధ్యక్షుడు రేణికుంట్ల శంకర్ మాదిగ, MSF మండల అధ్యక్షుడు మచ్చ శ్రీకాంత్ మాదిగ ఆధ్వర్యంలో డప్పుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి జిల్లా MRPS & MSP ఇంచార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ కోసం లక్ష డప్పులు, వెయ్యి గొంతుల సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. SC, ST, BC, మైనార్టీ వర్గాల నాయకులు, దళిత సమాజం ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం డాక్టర్ ఏకు నవీన్ తండ్రి కీర్తిశేషులు ఏకు మల్లేష్ జ్ఞాపకార్థంగా 100 డప్పుల బహుకరణ తో ప్రత్యేకంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యనాయకులు:
MYS జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతి మాదిగ
MRPS జిల్లా నాయకులు రేణికుంట్ల సంపత్ మాదిగ
MSP జిల్లా నాయకులు కన్నూరి సారయ్య మాదిగ
అక్కల రాజయ్య
MRPS మండల ప్రధాన కార్యదర్శి ఇల్లందుల శంకర్ మాదిగ
MSP మండల ప్రధాన కార్యదర్శి అంబాల సారయ్య మాదిగ
MSP మండల ఉపాధ్యక్షులు అక్కల భద్రయ్య మాదిగ
MRPS గ్రామశాఖ అధ్యక్షుడు బోయిని శ్రీకాంత్ మాదిగ
MRPS నాయకులు బోయిని రజినీకాంత్ మాదిగ
టేకుమట్ల మండల MRPS నాయకులు తదితరులు పాల్గొన్నారు.
