టేకుమట్ల, ఫిబ్రవరి 6: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చే జిల్లా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును అందుకోవటం జరిగింది. ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు సంగి రవి ఆధ్వర్యంలో టీజీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ చిట్యాల ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తు రెండు సార్లు బేస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న గోల్కొండ బిక్షపతిని సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘకాలంలో జగిత్యాల జిల్లా పెంబట్ల గురుకుల పాఠశాలలో టీజీటీగా 1994లో, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గురుకుల పాఠశాలలో పిజిటిగా 2004 లో, ములుగు జిల్లా జాకారం గురుకుల కళాశాల జూనియర్ లెక్చరర్ గా 2015లో, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల చిట్యాల ప్రిన్సిపాల్ గా 2020, 2025 సం,లలో రెండుసార్లు, మొత్తం ఐదు సార్లు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకోవటం హర్షించదగినదని, మా పిల్లలకు ఇలాంటి ఉత్తమ ఉపాధ్యాయుడు దొరకడం గర్వకారణమని పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు సంగి రవి కొనియాడారు.ఎందరో విద్యార్థుల భావితరాలకు బాటలు వేసి తీర్చిదిద్ది అనునిత్యం పాఠశాల, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తూ, పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఉత్తమ ఫలితాలు తీసుకురావడానికి, పిల్లల ఉన్నత శిఖరాల అవరోధానికి దోహదపడుతున్న ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతికి పేరెంట్స్ కమిటీ మెంబర్స్ ‘మీకు రుణపడి ఉంటామంటూ’ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ మెంబర్స్ మారపల్లి మల్లేష్, కన్నూరి రమేష్, కొలుగురీ సదానందం, సుంకరపల్లి భాస్కర్, దండ్రే రమేష్, సుంకరపల్లి దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
