హుజురాబాద్: పట్టణంలో పారిశుద్ధ్య నిబంధనలు పాటించడంపై హుజురాబాద్ మునిసిపాలిటీ కఠినంగా వ్యవహరిస్తోంది. మునిసిపల్ కమిషనర్ కె. సమ్మయ్య గ నేతృత్వంలో సోమవారం రోజున వైన్స్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, పారిశుద్ధ్య నియమాలు పాటించని కారణంగా నాగేంద్ర వైన్స్ మరియు మందాకిని వైన్స్ కు రూ. 5,000/- చొప్పున జరిమానా విధించారు.
ఈ తనిఖీల్లో మునిసిపల్ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ యం. కిషన్ రావు, వార్డు అధికారులు ఆర్. బాలగంగాధర్ తిలక్, సంపత్, ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ పి. వినయ్, మరియు సానిటరీ జవాన్లు ఆర్. సుధీర్, ఎ. రమేష్, పి. అనిల్ కుమార్, టి. కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
పట్టణ పారిశుద్ధ్యాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తప్పవని మునిసిపాలిటీ కమిషనర్ హెచ్చరించారు. తగిన నిబంధనలను పాటించని వ్యాపార సంస్థలపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
— Zindagi9news
