జూలూరుపాడు, ఫిబ్రవరి 03: జూలూరుపాడు మండల పరిధిలోని గంగారం తండా గ్రామంలో ఎస్ వి తేజ్ హైబ్రిడ్ సీడ్స్ హానర్ మరియు భద్ర మిర్చి విత్తనాలు వేసిన రైతు తోటలను రైతు సదస్సులు నిర్వహించడం జరిగింది, విత్తనాల డిస్ట్రిబ్యూటర్ శ్రీ వర్షా ఏజన్సీస్ యజమాని ధరావత్ శివ మరియు కంపెనీ ప్రతినిధి అన్సరి కలిసి సోమవారం మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 2000 మంది రైతు సోదరులు వచ్చి మిర్చి తోటను పరిశీలించారు చెట్లు వేపుగా పెరిగి మిర్చి కాయలు చెట్లకు బాగా కాయడంతో రైతులు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
విత్తనాలు వేసిన రైతు కూడా తన తోట చూడటానికి వచ్చిన రైతులకు వివరించాడు తక్కువ ఖర్చుతో తెగుళ్లను తట్టుకునే ఈ రకం విత్తనాలు వేయడం వలన తన పొలంలో ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల మధ్యలో దిగుబడి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా విత్తనాలను అందించే డిస్ట్రిబ్యూటర్ ధరావత్ శివ తోటను చూసేందుకు వచ్చిన రైతులతో మాట్లాడారు.
ఎక్కువ చీడపీడలను తట్టుకుంటుందని మంచి దిగుబడి వస్తుందని మండల వ్యాప్తంగా భద్ర వెరైటీ సుమారు 100 ఎకరాల్లో 50 మంది రైతులకు, హానర్ అనే వెరైటీ 70 ఎకరాల్లో 27 రైతులకి విత్తనాలను అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
