డోన్, ఫిబ్రవరి 3 : సర్వజన విద్యార్థి యువజన సమాఖ్య (SSYF) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రాసి పోగుల శివశంకర్ ఆధ్వర్యంలో సోమవారం రోజున డోన్ డివిజన్ ఆర్డీఓ నరసింహులు కి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్ మాట్లాడుతూ డోన్ పట్టణ ప్రాంతం సమీపంలో ఉన్న సివిల్ సప్లై రైస్ గోడౌన్ నుండి వివిధ పట్టణ గ్రామీణ ప్రాంతాల రేషన్ డీలర్లు,అంగన్వాడి హాస్టల్ కు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంచికి 50 కేజీలు నియమించింది. అయితే ఒక్క సంచికి మూడు నుంచి ఐదు కేజీలు తక్కువ వస్తున్నాయి. మరియు ప్రతి నెల ప్రతి గ్రామంలో ఉన్న డీలర్ ప్రతి పట్టణంలో ఉన్న డీలర్ ప్రతి హాస్టల్ వార్డెన్ ప్రతి నెల మామూలు బియ్యం ఒకటి రెండు బియ్యం సంచులు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే అధికారులను పంపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రతి చంచికి మూడు నుండి ఐదు కేజీలు తీసి అధికారులను వారికి వినని వ్యక్తుల దగ్గర పంపించి ఇబ్బందులకు గురి చేయడం, ఇవన్నీ సివిల్ సప్లై బియ్యం గోడెన్ ఇన్చార్జి చంద్రశేఖర్ సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో అక్కడ పని చేసే వారిదే పెత్తనం చెలాయిస్తున్నారు. ఇవన్నీ ఇన్చార్జి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. డోన్ డివిజన్ ఆర్ డి ఓ, డోన్ మండల ఎమ్మార్వో తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ ఎదుట భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బాబు కుమార్ ,శివ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
