టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఈ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కేపీ చౌదరి పూర్తి పేరు కృష్ణ ప్రసాద్ చౌదరి. 2016లో ‘కబాలి’ సినిమా తెలుగు వెర్షన్‌కు నిర్మాతగా వ్యవహరించారు. అదేవిధంగా, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘అర్జున్ సురవరం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు.
సినిమా రంగంలో నష్టాలను ఎదుర్కొన్న కేపీ చౌదరి, ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడానికి గోవాలో ‘OHM’ పబ్‌ను ప్రారంభించారు. అక్కడ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసే వ్యవహారంలో ఆయన పేరు తెరపైకి వచ్చింది. 2023లో 100 గ్రాముల కొకైన్‌తో పట్టుబడి, డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు.
ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కేపీ చౌదరి, గోవాలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
