ఖమ్మం, ఫిబ్రవరి 2: ఆదివారం రోజున స్థానిక బంజారభవన్ ఖమ్మం నందు తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫిబ్రవరి 15న సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా
సెలవు దినంగా ప్రకటించలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వీరన్న కోరారు.ఈ సమావేశంలో వీరన్న మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహరాజ్, హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుసుడయ్యారు.
సేవాలాల్ మహరాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో ఫేరి ఫర్ ఒకటి పేరి అనగా ఆంగ్లేయులు పై యుద్ధం చేయడం ,ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, క్షేత్రధర్మాన్ని రక్షించడం మొదలైనవి అన్ని ముఖ్యమైనవి.
ఇంతటి ఘన చరిత్ర కలిగిన సేవలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించుకొని జాతి చరిత్రను, జాతికి ఖ్యాతిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించేందుకు సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని
తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా శాఖ తరపున కోరారు .ఈ సమావేశంలో కోశాధికారి జరుపుల దేవా సింగ్, వైస్ ప్రెసిడెంట్ రమేష్, రాష్ట్ర కార్యదర్శి గంగావత్ శ్రీనివాస్ నాయక్,
సంఘ నాయకులు రమేష్, వీరన్న , నరేష్ భాస్కర్ ,నాగేశ్వరరావు ,భీంజీ రావు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
