
జమ్మికుంట, ఫిబ్రవరి 2 : జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బాల వికాస ఆధ్వర్యంలో నిర్వహించిన అనాధ బాలల పుట్టినరోజు వేడుకలకు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలు కోలాట నృత్యాలు చేస్తూ బతుకమ్మలు పూలజల్లులతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

