హుజరాబాద్, ఫిబ్రవరి 1: ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.తమ సమస్యల పరిష్కారానికి పలువురు జర్నలిస్టులు ప్రణవ్ నివాసంలో కలవగా వారు తెలిపిన ప్రతి సమస్యను తెలుసుకున్న ప్రణవ్ వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
