నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారం చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్యాపిలి మండలంలోని ఓబుల దేవరపల్లి బురుజుగుంట చెరువుకు నీళ్లు వదలడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్యాపిలి మాజీ ఎంపీపీ తొప్పెల శ్రీనివాసులు పూజా కార్యక్రమం చేసి నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రామ్మోహన్ యాదవ్, గండికోట పెద్ద రామాంజనేయులు,చిన్న పూజర్ల భాస్కర్ నాయుడు, వెంకటేష్ ,రామకృష్ణ, పుల్లయ్య,టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

