విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే సామాజిక అవగాహన పెంపొందించాలని మరియు వారికి అన్ని రకాలుగా చేయూతనివల్సిన అవసరం ఎంతగానో ఉందని అదే విధంగా సమాజంలో బాలికల పాత్ర చాలా విశిష్టమైనదని మరియు వారిని అన్ని రకాలుగా సంరక్షించాల్సిన అవసరం ఎంతగానో ఉందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ప్రైమరీ పాఠశాలలో వేడుకగా నిర్వహించినటువంటి ఆల్ అల్ఫోర్స్ నాలెడ్జ్ హబ్, జాతీయ బాలికల దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై సంప్రదాయబద్ధంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ఆరంభించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పలు విషయాల పట్ల అవగాహన పెంపొందించడమే కాకుండా వాటిలోని విషయాలను సమగ్రంగా & విశ్లేషణాత్మకంగా తెలియపరచినట్లయితే పలు విషయాలపై పట్టు సాధించిన వారే కాకుండా వివిధ రంగాలలో విజయాలను చాలా సులభంగా నమోదు చేసుకున్నందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
విద్యార్థులకు చిన్ననాటి నుండే పలు విషయాల పట్ల చాలా సమగ్రంగా విషయాలను తెలిసి తెలియపరచినట్లయితే పై చదువులలో వారికి విషయాలు చాలా సులభంగా అర్థమవడమే కాకుండా విజయాలను చాలా సునాయాసంగా నమోదు చేయగలుగుతారని చెప్పారు.
తల్లిదండ్రులు సైతం వారి పిల్లలకు ఇష్టమైన రంగాలలో విద్యను అందించి వారికి తగిన వనరులు కల్పించి విజేతలుగా తయారు చేయాలని సూచించారు
ప్రాథమిక దశ నుండే విద్యార్థులకు అన్ని వనరులను కల్పించినట్లయితే పలు రంగాలలో విజయం సాధిస్తారని చెస్, క్రికెట్ క్రీడలలో మనకు స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పారు
వేడుకలలో భాగంగా జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలతో ఏర్పాటు చేసినటువంటి ముఖాముఖి కార్యక్రమానికి హాజరై వారు మాట్లాడారు బాలికలు దేశ అభివృద్ధిలో చాలా కీలకమని మరియు వారికి విద్యతోపాటు అన్ని సదుపాయాలను కల్పించాలని సైతం కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల విద్య కొరకు ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించడమే కాకుండా అత్యధికంగా నిధులు కేటాయిస్తూ వారి పురోభివృద్ధికై శ్రమిస్తున్నారని కొనియాడారు. బాలికలను సంరక్షించాల్సిన అవసరమే కాకుండా వారిని విద్యావేత్తలుగా తయారు చేయాలని మరియు భావి భారతదేశం వారి మీద ఆధారపడి ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేని చెప్పారు.
నేడు జాతీయ స్థాయిలో నిర్వహింపబడేటువంటి బాలికల దినోత్సవం సందర్భంగా విద్య వారికి అన్ని రకాలుగా చేయూతనివ్వాలని మరియు బాలికల సాధికారికత ద్వారా వారిని దేశం అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు కార్యక్రమాలు ముఖ్యంగా తెలంగాణ ఆహారం, తెలంగాణ గ్రామీణ ప్రాంత ముఖచిత్రం, తెలంగాణ కళలు, తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు, “బాలికలే భావి పౌరులు”, “బాలికలే దేశ భావి నిర్మాతలు”, నాటికలు ప్రత్యేకంగా ఆకర్షించాయి
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొని వారు హర్షం వ్యక్తం చేశారు.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
