ఖమ్మం వైరా మండలం విప్పలమడక గ్రామసభలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందలేదని గ్రామంలోని రెండు వర్గాలు సభలో ప్రకటించిన లిస్టులో తమ పేర్లు లేవంటూ ఆందోళన చేపట్టారు. గ్రామంలో నివసించని వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించారంటూ గ్రామసభలో తమ పేర్లు లేవంటూ ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న తమకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని గ్రామంలో నివసించకపోయిన గ్రామంలో ఇల్లు ఉన్న ఇందిరమ్మ ఇల్లు కేటాయించారంటూ వర్గం ఆరోపణ చేయటంతో మరో వర్గం ఘర్షణకు దిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండో వర్గాల వారిని ఉదయించారు.గ్రామసభకు వచ్చిన సిపిఎం పార్టీకి చెందిన నాయకులు బొంతు రాంబాబు ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ఎందుకు పరిగణనగల్లోకి తీసుకోలేదని తాసిల్దారును నిలదీయడంతో ఇవి కేవలం ఆన్లైన్లో చేసిన వాటికి వచ్చినాయని మరల గ్రామసభలో ధరఖాస్తు చేస్తే పరిశీలించి ఇందిరమ్మ ఇండ్లు వచ్చె విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
