పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు స్టడీ మెటీరియల్ పంపిణీ.
విద్యారంగంలో నూతన ప్రమాణాలకై కృషిచేస్తా..
ప్రైవేటు యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా..
రామాయంపేట పట్టబద్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

రామాయంపేట : ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధిగా తాను పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నా ని రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా వి. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు…గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పలువురు పట్టభద్రులను కలిసి రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని కోరారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా తనకు మద్దతు తెలపాలని కోరారు.. తాను ఎమ్మెల్సీ గెలిస్తే విద్యారంగంలో నూతన ప్రమాణాలకై కృషి చేస్తానని వెల్లడించారు.. ఉద్యోగ నిరుద్యోగ సమస్యలపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మండలిలో గలమెత్తుతానని వెల్లడించారు.. ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతతో పాటు వారికి హెల్త్ కార్డులు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు… ప్రైవేటు జూనియర్ ,డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు…

నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు.. గత ఐదు నెలలుగా ఎమ్మెల్సీ పరిధిలోని ఉమ్మడి నాలుగు జిల్లాల గ్రంధాలయాలను సందర్శించి చాలాచోట్ల మౌళిక సదుపాయాలు కల్పించాలని… కొన్నిచోట్ల దూర ప్రాంతాల నుండి గ్రంధాలయాలకు వచ్చే విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తాను స్వచ్ఛంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్ ను కూడా అందించినటు వెల్లడించారు.. ప్రైవేటు విద్యారంగం నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు.. రాజకీయ రంగంలో కూడా నూతన ఒరవడిని సృష్టిస్తానని పేర్కొన్నారు..రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి, ఫణిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
