రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులను జారీ చేయనున్నారు.
మంత్రివర్గం ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించాక కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపిస్తారు.మండలస్థాయిలో ఎంపీడీవో, యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . రేషన్ కార్డు ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించి, చదివి వినిపించిన తర్వాత ఆమోదిస్తారు .


Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
