జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 26, 28, 29 వార్డులలో స్వయంగా కమిషనర్ మొహమ్మద్ ఆయాజ్ పర్యటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసరం వార్డు లలో ర్యాండం సర్వే చేశారు. వార్డు అధికారులు సర్వే చేస్తున్న తీరును ఆయన పరిశీలించారు. వార్డు ఆఫీసర్లు విధిగా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే పనులు ఆన్లైన్ లో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి తో పాటు పలువురు వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.
