వెలమలను దూషించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ పై చర్యలు తీసుకోవాలని డివిజన్ వెలమ సంఘం ఆధ్వర్యంలో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు… దిష్టిబొమ్మ దగ్ధం, నల్ల బ్యాడ్జీలతో నిరసన.
హుజురాబాద్: షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అకారణంగా వెలమ కులాన్ని దూషిస్తూ కించపరుస్తూ నాన రకాలుగా మాట్లాడటాన్ని నిరసిస్తూ హుజురాబాద్ డివిజన్ వెలమ సంఘం ఆధ్వర్యంలో హుజురాబాద్, ఎలకతుర్తి, కమలాపూర్ మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశారు. ముందుగా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే శంకర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసారు. శంకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హుజురాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, తాసిల్దార్ కనుకయ్యలకు ఎమ్మెల్యే శంకర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వెలమ సంఘం నాయకులు పలువురు మాట్లాడుతూ వెలమ కులాన్ని దుర్భాషలాడుతూ దూషించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తక్షణమే క్షమాపణ చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని హుజురాబాద్ వెలమ సంఘం నాయకుల డిమాండ్ చేశారు. శంకర్ దూషించడానికి నిరసిస్తూ వెలమ కులానికి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఆయనపై చర్యలు తీసుకునేలా చూడాలని లేదంటే తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి తమతో పాటు ఉద్యమానికి సిద్ధం కావాలని వెలమ సంఘం నాయకులు సూచించారు. ఎవరైనా మరోసారి వెలమ కులాన్ని గాని, వెలమ సంఘం నాయకులను గానీ దూషించినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆల్ ఇండియా వెలమ సంఘం ఈసీ సభ్యురాలు బొంత గోమతి, హుజురాబాద్ డివిజన్ వెలమ సంఘం అధ్యక్షుడు పంబిడి జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడు పుల్లూరి ప్రభాకర్ రావు, కార్యదర్శి సాగి రామ్ భద్రరావు, కళ్లెపు మోహన్ రావు, వర్ధినేని రవీందర్ రావు, బోయినపల్లి వెంకటేశ్వరరావు, కళ్లెపు రాఘవరావు, గుజ్జ మలహల్ రావు, జనగామ రాజేశ్వరరావు, పొన్నగంటి శ్రావణ్ రావు, కన్వీనర్ కళ్లెపు సుధాకర్ రావు, నామ శ్రీనివాసరావు, మాసాడి ముత్యంరావు, మాసాడి బాపూరావు, సాగి వీరభద్రరావు, బొంత మాధవరావు తక్కల్లపల్లి వెంకట్రావు , దేవేందర్ రావు, కే రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
