ఇండియా పోస్ట్‌లో 25,000+ GDS ఉద్యోగాలు.. 10వ తరగతితోనే అవకాశం

న్యూఢిల్లీ, ఆగస్టు 28 (జిందగీ9న్యూస్):
ఇండియా పోస్ట్ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ డాక్ సేవక్ (GDS) – Schedule-II, July-2026 కింద దేశవ్యాప్తంగా 25,000కు పైగా BPM, ABPM, డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ వివరాలు
పోస్టులు:
• బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)
• అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM)
• డాక్ సేవక్
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌లో పాస్ కావడంతో పాటు సంబంధిత స్థానిక భాషను 10వ తరగతి వరకు చదివి ఉండాలి. తెలంగాణకు తెలుగు స్థానిక భాషగా ఉంది.
వయసు: 18 నుంచి 40 సంవత్సరాలు. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
వేతనం
BPM: రూ.12,000 నుంచి రూ.29,380 వరకు
ABPM/డాక్ సేవక్: రూ.10,000 నుంచి రూ.24,470 వరకు TRCA
ఎంపిక విధానం
ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు
దరఖాస్తు రుసుము రూ.100. మహిళలు, SC/ST, PwBD, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఫీజు మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు
రిజిస్ట్రేషన్: ఆగస్టు 31 – సెప్టెంబర్ 19, 2026
దరఖాస్తు: సెప్టెంబర్ 2 – సెప్టెంబర్ 21, 2026
దరఖాస్తు సవరణ: సెప్టెంబర్ 23–24, 2026
ముఖ్య గమనిక
GDS పోస్టులు సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు భిన్నమైన ప్రత్యేక నిబంధనల కింద ఉంటాయి. రోజుకు సాధారణంగా 4 నుంచి 5 గంటల పని ఉంటుంది. BPMగా ఎంపికైన వారు పోస్టాఫీసు నిర్వహణకు అవసరమైన వసతి కల్పించాల్సి ఉంటుంది.
🌐 అధికారిక వెబ్సైట్ : https://indiapost.gov.in/gdsonlineengagement
📄 పూర్తి నోటిఫికేషన్
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
