నిరుపేద పట్టభద్రులకు సంక్షేమ నిధి
విద్యారంగంలో నూతన ప్రమాణాలకై కృషిచేస్తా.
ప్రైవేటు యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిరుపేద ఉపాధ్యాయుల కోసం సంక్షేమానికి నిధి ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి తోడు పడతానని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.. శనివారం కరీంనగర్ పట్టణంలో పలువురి పట్టభద్రులను కలిసి రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పలువురి పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు విఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్ ను అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యారంగం నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. తాను గెలిస్తే ఒక ప్రైవేటు టీచర్ గెలిచినట్టేనని తెలిపారు.. ప్రైవేటు విద్యాసంస్థల సంక్షేమానికి వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళల కృషి చేస్తానని.. ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత తో పాటు, హెల్త్ కార్డుల మంజూరీకి కృషి చేస్తానని ని వెల్లడించారు… ప్రైవేటు పాఠశాలల అనుమతుల మంజూరి సమయంలో ఉన్న నిబంధనలను సరళీకృతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు… ప్రైవేటు జూనియర్ డిగ్రీ పిజి కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్ మెండి బకాయిలు, విద్యార్థులకు స్కాలర్షిప్పులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు..
నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు.. గత ఐదు నెలలుగా ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో గ్రంధాలయాలను సందర్శించి చాలాచోట్ల మౌళిక సదుపాయాలు కల్పించాలని… కొన్నిచోట్ల దూర ప్రాంతాల నుండి గ్రంధాలయాలకు వచ్చే విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తాను స్వచ్ఛంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్ ను కూడా అందించినటు వెల్లడించారు.. ప్రైవేటు విద్యారంగం నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు.. రాజకీయ రంగంలో కూడా నూతన ఒరవడిని సృష్టిస్తానని పేర్కొన్నారు..రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు..

