19 ఏళ్ల కలను నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి
హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా రాజశ్రీకు ఉద్యోగ నియామకం
కారుణ్య నియామకం కోసం గత 19 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఓ మహిళకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆశాజ్యోతి ఇచ్చారు. హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి, ఆ కుటుంబానికి మద్దతుగా నిలిచారు.
- వరంగల్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బి. భీమ్ సింగ్ 1996 సెప్టెంబర్ 24న ఎన్కౌంటర్లో మరణించారు.
- ఆయన కుమార్తె బి. రాజశ్రీ కారుణ్య నియామకం కోసం అప్పటినుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు.
- గత ప్రభుత్వాలు సాంకేతిక కారణాలు చూపుతూ ఉద్యోగాన్ని ఇవ్వలేదు.
రాజశ్రీ సమస్యను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి , నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని సూచించారు.
దీంతో హోం శాఖ నుంచి జూనియర్ అసిస్టెంట్‌గా రాజశ్రీకి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రిని కలిసి రాజశ్రీ, ఆమె కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే నాగరాజు తో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఘటన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి మానవతా వైఖరికి మరో ముద్ర పడింది.

