
తెలంగాణ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. కులగణనను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా పేర్కొన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించారు.
కులగణన పేరుతో ప్రభుత్వం ప్రజా ధనంలో ₹160 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, దాని ఫలితం ప్రజలకు కనబడలేదని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
BC లకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా, తాజాగా ప్రకటించిన పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో BC కోటా 24% నుంచి 17%కి తగ్గిందని ఆయన విమర్శించారు.
భారీ ఖర్చుతో నిర్వహించిన కులగణన చివరికి BC సమాజానికి నష్టం చేస్తోందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
“ఈ ఫలితానికి 160 కోట్లు ఖర్చు చేశారా? ప్రజా ధనాన్ని ఇలా వృథా చేసిన తెలివి ఎవరిది?” అంటూ ఆయన ప్రశ్నించారు.
కులగణన పేరుతో చేసిన ప్రక్రియకు ప్రయోజనం ఏమిటో, ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కేటీఆర్ అన్నారు.
