హుజురాబాద్: ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, కళాశాల ప్రాంగణంలో ఘనంగా సన్మానించబడ్డారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వి. ఆంజనేయ రావు విద్యార్థులకు పుష్ప గుచ్ఛాలు అందించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “హుజురాబాద్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల పదవ తరగతి విద్యార్థులు తమ ఉన్నత విద్యను మన కళాశాలలో కొనసాగించాలి. అన్ని వసతులతో, ఉత్తమ బోధనతో మీ పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతాము. తల్లిదండ్రుల ఆశల నెరవేరుస్తూ మంచి ఫలితాలతో కళాశాలకు మంచి పేరు తెస్తాం” అని అన్నారు.
మొదటి సంవత్సరం టాపర్లు:
MPC: కే. అభిరామ్ (463/470), బి. శ్రావణి (446/470), పి. అభిరామ్ (443/470), ఆర్. వర్షిత (416/470)
BiPC: జే. మాధవి (379/440)
CEC: పి. అర్చన (386/500)
HEC: టీ. అఖిల (400/500)
ద్వితీయ సంవత్సరం టాపర్లు:
MPC: కె. సిరి చందన (879/1000)
BiPC: జార మరియం (873/1000)
CEC: ఎం. లక్ష్మణ్ (586/1000)
HEC: ఎం. రామ్ చరణ్ (928/1000)
వొకేషనల్ మొదటి సంవత్సరం టాపర్లు:
కే. ఆశిష్ కుమార్ (CT – 395), ఆర్. అభినయ్ (Fisheries – 389), జి. మనికంఠ (E&CT – 375), ఎం. జస్వంత్ (ET – 341)
వొకేషనల్ ద్వితీయ సంవత్సరం టాపర్లు:
బి. రమేష్ (CT – 792), చే. వెంకటేష్ (Fisheries – 896), పి. అజయ్ (E&CT – 666), టీ. వెంకటేష్ (ET – 780)
వీరందరికీ పుష్ప గుచ్ఛములు అందించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తులసీదాస్, వాసుదేవరావు, విజేందర్ రెడ్డి, రాజశేఖర్, మల్లారెడ్డి, సురేష్, వెంకటరమణ, మురళీ మోహన్, రజిత, శైలజ, సుహాసిని, రేణుక, జ్యోతి, రజనీ, రాజేందర్, రాగమయి, రామరాజు, వనమాల తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
