డోన్ మండలం కొట్రాయి గ్రామానికి చెందిన స్ఫూర్తి శ్రేయోభిలాషులు, గ్రామీణ వైద్యులు రంగ కుమార్తె చిన్నారి రక్షిత పుట్టినరోజు సందర్బంగా స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం రోజున శ్రీ కాశీనాయన సేవాశ్రమం నందు వృద్ధుల మధ్యన కేక్ కటింగ్ చేసి ఆశ్రమ వాసులకు అన్నదానం చేశారు. అనంతరం పద్మావతి వృద్దాశ్రమంలోని వృద్ధులకు భోజనాలు పంపిణీ చేశారు. రక్షిత పుట్టినరోజు సందర్బంగా రెండు వృద్దాశ్రమాల్లో అన్నదానం చేసిన రంగ కుటుంబ సభ్యులకు ఆశ్రమ వృద్ధులు, స్ఫూర్తి సభ్యులు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్ఫూర్తి సభ్యులు స్ఫూర్తి మధు, భాస్కర్, మోహన్ రెడ్డి, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు…
