ఖమ్మం, ఫిబ్రవరి 5 : స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉన్నందున పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని బాణోత్ మదన్ లాల్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయనొక ప్రకటన విడు దల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్నదని, తెలంగాణ రాష్ట్ర ప్రజల కేసిఆర్,కేటీఆర్ లను ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేకపోతున్నా వలన విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయిందని అన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ,రాజ్యసభ సభ్యులు వద్దిరాజూ రవిచంద్ర ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
కష్టపడి పనిచేస్తే భవిష్యత్ అంతా మనదేనని, వైరా నియోజవర్గంలో పార్టీ నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లుగా బరిలో నిలిచే అభ్యర్థులు ప్రజలతో మమేకం కావాలన్నారు. వారి సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చూడాల న్నారు. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందు సమష్టిగా పని చేయాలని ఆయన కోరారు. నాకు అధికారం ఉన్న లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా ఏ సమస్య అయినా పరిష్కరిస్తా అని అన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
