నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన సిపిఐ నాయకులు, సీనియర్ న్యాయవాది, కామ్రేడ్.డి.ఖాసిం సాహెబ్ (55) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.ఆయన మృతికి సిఐటియు జిల్లా కార్యదర్శి టి.శివరాం,సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు జి.కొండయ్య,రైతు సంఘం మండల అధ్యక్షులు బి.నాగమద్దయ్య సంతాపం వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న వారు సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయం దగ్గరకు చేరుకొని మృతుని భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ కామ్రేడ్.డి.ఖాసిం సాహెబ్ విద్యార్థి నాయకునిగా విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదిగి సిపిఐ డోన్ మండల కార్యదర్శిగా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన గొప్ప నాయకుడని వారు కొనియాడారు.ఆయన ఆకస్మిక మరణం బాధాకరమని సిపిఐ పార్టీకి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వేణు కుమార్ రంగడు,నాగరాజు,చిన్న మద్దయ్య,మద్దిలేటి స్వామి,ప్రతాప్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
