
ఢిల్లీ: పార్లమెంట్లో ప్రారంభమైన కేంద్ర బడ్జెట్ ప్రసంగం
ఢిల్లీలో లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పవిత్ర మాఘ పౌర్ణమి రోజున బడ్జెట్ను సభలో ఉంచుతున్నామని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన మంత్రి, భారత్ ప్రస్తుతం 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. అభివృద్ధి దిశగా స్పష్టమైన అడుగులు వేస్తూ ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.అంతర్జాతీయ సవాళ్ల మధ్య కూడా గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు దిశగా ఈ బడ్జెట్ కీలకంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
