రాష్ట్రవ్యాప్తంగా గణేష్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ – తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండుగల సందర్భంగా గణేష్ మండపాలు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. సదరు నిర్ణయాన్ని సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSPDCL) ప్రకటించింది.
గణేష్ నవరాత్రి సందర్భంగా ఆగస్టు 27, 2025 నుంచి సెప్టెంబర్ 6, 2025 వరకు మొత్తం 11 రోజులు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు.
దుర్గామాత నవరాత్రి సందర్భంగా సెప్టెంబర్ 29, 2025 నుంచి అక్టోబర్ 12, 2025 వరకు మొత్తం 15 రోజులు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే మండపాలకు ఈ సదుపాయం వర్తించనుందని TSPDCL స్పష్టంచేసింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
