కరీంనగర్:ఆధునిక సమాజంలో రక్తదానం యొక్క ప్రాముఖ్యతని తెలియజేసి ఉద్దేశంతో అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి.నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.. ఆదివారం నగరంలోని గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అల్ఫోర్స్ డిగ్రీ, పీజీ కళాశాల మరియు లియో క్లబ్ మరియు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహిందారు.

అల్ఫోర్స్ డిగ్రీ పీజీ కళాశాల కరాస్పాండెంట్ వి.రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ రక్తదాన కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరీంనగర్ ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టబదులు ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ సేవలో ముందుండే ఆల్ఫోర్స్ మహిళ డిగ్రీ మరియు పీజీ కళాశాల అభ్యుదయానికి ఇది మరో మంచి అడుగని ప్రశంసించారు.. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం వీలు కాదు కాబట్టి ఇలాంటి రక్త నిల్వలు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయని అని తెలిపారు. దేశానికి ఏదైనా చేయడం అంటే ఒక్కరికి అయినా రక్త దానం చేయడం అని ఉద్భోదించారు. మహిళలు చేయలేని పని ఏది కూడా లేదు అని దానికి ఉదాహరణ ఈ రోజు అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు చేస్తున్న ఈ రక్తదానం అని అభినందించారు. వి. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక యువత ఫ్యాషన్ పేరిట టాటూస్ (పచ్చ బొట్ల) పేరిట వింత వింతపోకడలతో ప్రవర్తిస్తున్న తీరు రక్తదానం సమయంలో ఎంత ఇబ్బంది పాలు చేస్తుందో వివరించారు. రక్తదానం ప్రాణదానం అని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తూ ఆడ, మగ అనే భేదం లేకుండా రక్తదానాన్ని చేయగలగాలి అని సూచనలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ముందు ఉంటుందని అలా తమ విద్యార్ధులని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో వాలంటీర్లు, అధ్యాపకులు మరియు కాలనీ వాసులు 50 మంది రక్త దానం చేసినారు.ఈ సందర్భంగా గా లియో క్లబ్ సభ్యులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ వి. రవీందర్రెడ్డి,ప్రిన్సిపాల్, గోలి, శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్స్, యన్.ఎస్. ఎస్. ప్రోగ్రామ్ అధికారులు, బి. అనిల్, యెన్, రజిత, అధ్యాపక బృందం, లియో క్లబ్ ప్రతినిధులు, సూర్య నగర్ కాలనీవాసులు, విపార్క్ ఆటో స్టాండ్ యూనియన్ మెంబర్స్ తో పాటు కళాశాల విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
