జిందగీ ఫిబ్రవరి 25 : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామంలోని శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ పల్లె తిరుపతిరెడ్డి మండల ప్రజలకు మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.
శివరాత్రి పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావనతో ఉపవాసం ఉండి పవిత్రంగా జరుపుకుంటారు. పరమేశ్వరుని అనుగ్రహంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పల్లె తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు.
