హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి శుభాకాంక్షలు

తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కించుకుని ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఆయన నివాసంలో కలిసి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే విధంగా మంత్రివర్గ విస్తరణ చేసింది. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తోంది” అని ఆయన అన్నారు.
ప్రస్తుత మంత్రివర్గ విస్తరణ ఈ మాటలకు నిదర్శనమని పేర్కొంటూ, నూతన మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
