రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి 8 :బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామానికి చెందిన, ముంపు గ్రామాల అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ బి.సి.సెల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్ తండ్రి కూస రామస్వామి శుక్రవారం మరణించగా, శనివారం రోజున వారి భౌతికకాయనికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా కూస రవీందర్ తో పాటు కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వారి వెంట కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, పెద్దమనుషులు, తదితరులు పాల్గొన్నారు.

